చినవెంకన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ABN , Publish Date - Sep 14 , 2026 | 06:16 AM
ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య ఆదివారం సందర్శించారు.
ద్వారకాతిరుమల, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య ఆదివారం సందర్శించారు. ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభ ఘనస్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్న న్యాయమూర్తికి అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఏఈవో పి.నటరాజారావు స్వామివారి మెమెంటోను, ప్రసాదాలను అందజేశారు.
ఈ వార్తలనూ చదవండి..
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి
‘డీఎస్సీపై చర్చకు జగన్ సిద్ధమా?’