నిజమజ్జనం కోసం ఏర్పాట్లు చేశాం
ABN , Publish Date - Sep 13 , 2026 | 11:31 PM
నగరంలోని వినాయక నిమజ్జనాన్ని ఘనంగా ఎలాంటి ఇబ్బందులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర పరిశ్రమల శాఖల మంత్రి టీజీ భరత్ అన్నారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కేసీ కెనాల్, హంద్రీనీవా ప్రాంతాల్లో ఏర్పాట్ల పరిశీలన
కర్నూలు అర్బన్ , సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): నగరంలోని వినాయక నిమజ్జనాన్ని ఘనంగా ఎలాంటి ఇబ్బందులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర పరిశ్రమల శాఖల మంత్రి టీజీ భరత్ అన్నారు. ఆదివారం కర్నూలులోని వినాయక ఘాట్ వద్ద కేసీ కాలువ, నన్నూరు టోల్‌ప్లాజా వద్ద హంద్రీనీవా ప్రాంతాల్లో వినాయక నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. నీటి లభ్యత, భద్రత, మౌలిక సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన అధికారు లకు పలు కీలక సూచనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ సుంకేసుల బ్యారేజీలో 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ సారీ అత్యల్పంగా 0.288 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉందని తెలిపారు. సుంకేసుల బ్యారేజ్ నుంచి నేరు గా కేసీ కాలువకు నిమజ్జనం కోసం నీటిని విడుదల చేసే పరిస్థితి ఈసారి లేదన్నారు. ఈనేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించామన్నారు. వినాయక ఘాట్ వద్ద కేసీ కాలువలో ఎన్నడూ లేని విధంగా రెండు వైపుల గోడలు నిర్మించి ట్యాంక్ తరహ నీటిని నిల్వ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పంప్ హౌస్ నుంచి ప్రతిరోజు వృఽథాగా పోతున్న సుమారు 20 లక్షల లీటర్ల నీటిని కేసీ కాలువకు తరలించి, వినాయకఘాట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసే ట్యాంక్‌లో నిల్వ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. కర్నూలు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో క్రేన్లు, ఇతర అవసరమైన సదుపాయాలను కూడా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం హంద్రీ నీవా లో నీటిప్రవాహం బాగుందని, వినాయక నిమజ్జనం సమయంలో కూడా నిరంతర నీటి ప్రవాహం ఉండే అవకాశం ఉందన్నారు. కేసీ కాలువ, నన్నూరు టోల్ ప్లాజా గేట్ వద్ద హంద్రీ నీవా ప్రాంతాలకు వినాయక నిమజ్ఞన కమిటీ సభ్యులు పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేష్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.