మంగళగిరిలో దారుణం.. అత్తమామలను కారుతో ఢీకొట్టిన అల్లుడు
ABN , Publish Date - Jul 11 , 2026 | 01:47 PM
గుంటూరు జిల్లా మంగళగిరిలో కుటుంబ కలహాలు దారుణానికి దారితీశాయి. భార్యను కాపురానికి పంపడం లేదన్న ఆగ్రహంతో అత్తమామలపై అల్లుడు కారుతో దూసుకెళ్లాడు.
గుంటూరు జిల్లా: మంగళగిరిలో దారుణం చోటుచేసుకుంది. భార్యను కాపురానికి పంపడం లేదన్న ఆగ్రహంతో ఓ అల్లుడు తన అత్తమామలను కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో అత్తమామలు తీవ్రంగా గాయపడగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మంగళగిరికి చెందిన శ్రీనివాసరావు, పద్మావతి దంపతులు తమ కుమార్తెను భర్త వద్దకు పంపడంపై వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అల్లుడు, తనకు పరిచయమైన మరో ఇద్దరితో కలిసి కారులో వచ్చి అత్తమామలపై ఉద్దేశపూర్వకంగా దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో శ్రీనివాసరావు, పద్మావతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరికీ చికిత్స కొనసాగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడితో పాటు ఘటనలో సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఘటనకు గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read:
గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం