Share News

సీనియర్ జర్నలిస్టు పాయల్ మెహతా మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..

ABN , Publish Date - Sep 20 , 2026 | 09:12 AM

సీనియర్ జర్నలిస్టు పాయల్ మెహతా ఆకస్మిక మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాయల్ మెహతా నిజాయితీ, అంకితభావంతో పనిచేసే జర్నలిస్టు అని ఆయన కొనియాడారు.

సీనియర్ జర్నలిస్టు పాయల్ మెహతా మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
CM Chandrababu Naidu

అమరావతి: సీనియర్ జర్నలిస్టు పాయల్ మెహతా ఆకస్మిక మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాయల్ మెహతా నిజాయితీ, అంకితభావంతో పనిచేసే జర్నలిస్టు అని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పలు సందర్భాల్లో ఆమె వచ్చి క్షేత్రస్థాయిలో వార్తలను రిపోర్ట్ చేశారని తెలిపారు. వార్తల కోసం ఆమె ఎంతో శ్రమించేవారని, కథనాల కోసం అదనపు కృషి చేసేవారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.


పార్లమెంట్‌లో తాము కలిసిన సందర్భాల్లోనూ పాయల్ మెహతా తనను పలకరించి, తాజా పరిణామాలను పంచుకునేవారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆమె తన వృత్తిపై చూపిన ఉత్సాహం, జర్నలిజం పట్ల నిబద్ధత, అందరినీ ఆప్యాయంగా పలకరించే చిరునవ్వు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఈ సందర్భంగా పాయల్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు, సదరు మీడియా సంస్థకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. 'ఓం శాంతి' అంటూ సీఎం చంద్రబాబు తన సంతాప సందేశాన్ని ముగించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

త్రిబుల్‌ ఇంజన్‌ గ్రోత్‌తో ఎన్డీఏ పాలన: మాధవ్‌

Updated Date - Sep 20 , 2026 | 09:16 AM