ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం
ABN , Publish Date - Sep 20 , 2026 | 05:15 AM
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో హైవేపై కేవీఆర్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం నుంచి పలాస వైపు వెళ్తున్న ఈ బస్సు... శనివారం ఉదయం 9.35 గంటల సమయంలో జమ్ము జంక్షన్ వద్ద మలుపు తిరుగుతుండగా..
అప్రమత్తతతో తప్పిన ముప్పు.. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితం
షార్ట్‌సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారణ
నరసన్నపేట, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో హైవేపై కేవీఆర్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం నుంచి పలాస వైపు వెళ్తున్న ఈ బస్సు... శనివారం ఉదయం 9.35 గంటల సమయంలో జమ్ము జంక్షన్ వద్ద మలుపు తిరుగుతుండగా.. ఏసీలు రెయిలింగ్ వద్ద షార్ట్‌సర్క్యూట్ కారణంగా బస్సు వెనుక టైర్లపై పొగలు వచ్చాయి. దీనిని బస్సు వెనుక వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు గమనించాడు. వెంటనే బస్సు డ్రైవర్‌ను అప్రమత్తం చేశాడు. డ్రైవర్ వెంటనే బస్సును ఆపాడు. లోపల ఉన్న ఐదుగురు ప్రయాణికులు, మరో డ్రైవర్, క్లీనర్‌తోపాటు కిందకు దిగిపోయాడు. ఇంతలోనే ఎయిర్ సిలిండర్లు పేలాయి. మంటలు వ్యాపించి బస్సు అంతా దగ్ధమైంది. ఎస్‌ఐ గణేశ్, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సహాయక చర్యలు చేపట్టారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మోహనరావు, నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, టెక్కలి మోటార్ వెహికల్ అధికారి సంజీవరావు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ వార్తలనూ చదవండి...
కుప్పం బ్రాంచ్ కెనాల్ పరిధి పెంపు