రాజధాని అమరావతిలో రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆస్పత్రి
ABN , Publish Date - Sep 29 , 2026 | 08:10 PM
రాజధాని అమరావతిలో రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆస్పత్రి ఏర్పాటు కానుంది. తుళ్లూరు, అనంతవరం పరిధిలో ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్, ఏపీసీఆర్‌డీఏ మధ్య అవగాహన ఒప్పందం (MoU) పూర్తయింది.
అమరావతి: రాజధాని అమరావతిలో మరో కీలక వైద్య సంస్థ ఏర్పాటు కానుంది. తుళ్లూరు, అనంతవరం పరిధిలో రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి ఒప్పందం పూర్తయింది. ఈ మేరకు రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్, ఏపీసీఆర్‌డీఏ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. అమరావతి పరిధిలోని రెండు ఎకరాల స్థలంలో 250 పడకల సామర్థ్యంతో ఈ ఆస్పత్రిని నిర్మించనున్నారు. రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆస్పత్రి ఏర్పాటుతో అమరావతి, తుళ్లూరు, అనంతవరం పరిసర ప్రాంతాలతో పాటు రాజధాని ప్రాంత ప్రజలకు చిన్నారుల వైద్యం మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read:
అక్టోబర్ 1 నుంచి రైల్వే టికెట్ చెకింగ్ డ్రైవ్.. ప్రయాణికులు ఈ పత్రాలను వెంట ఉంచుకోవాల్సిందే!
మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు.. విచారణలో సంచలన విషయాలు వెల్లడి..