Share News

పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు..

ABN , Publish Date - May 23 , 2026 | 09:09 PM

పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా రద్దయ్యింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆయన ఎస్సీ హోదాను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్.. చింతాడ ఆనంద్ ఎస్సీ హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు..
Pastor Chintada Anand

బాపట్ల జిల్లా: పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా రద్దయ్యింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆయన ఎస్సీ హోదాను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు చింతాడ ఆనంద్ ఎస్సీ హోదాను రద్దు చేస్తున్నట్లు బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ ప్రకటించారు. ఓ వివాదంలో పాస్టర్ ఆనంద్‌ ఎస్సీ కాదంటూ అక్కల రామిరెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


ఇటీవల విచారణ చేపట్టిన ధర్మాసనం పాస్టర్ ఆనంద్ ఎస్సీ కాదని తేల్చి చెప్పింది. ఎస్సీ కులాల్లో పుట్టి హిందూ మతం వీడితే ఆ హోదా ఉండదని తెలిపింది. ఈ మేరకు పాస్టర్ ఆనంద్‌ను క్రిస్టియన్‌గా నిర్ధారిస్తూ ఎస్సీ హోదాను రద్దు చేసింది. అనంతరం దీనిపై కలెక్టర్ వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ఆనంద్ మతం మారారని తాజాగా నిర్ధారించుకుని హోదాను రద్దు చేశారు. కాగా, పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి

కుటుంబంతో ప్రధాని మోదీని కలిసిన కేంద్ర మంత్రి.. ఎక్స్ వేదికగా భావోద్వేగం..

అనకాపల్లి జిల్లాలో గాలివాన బీభత్సం.. ముగ్గురి మృతి..

Updated Date - May 23 , 2026 | 09:09 PM