Share News

కుటుంబంతో ప్రధాని మోదీని కలిసిన కేంద్ర మంత్రి.. ఎక్స్ వేదికగా భావోద్వేగం..

ABN , Publish Date - May 23 , 2026 | 06:27 PM

కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం కుటుంబంతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తల్లి ప్రధాన మంత్రికి మొక్కను బహుకరించారు.

కుటుంబంతో ప్రధాని మోదీని కలిసిన కేంద్ర మంత్రి.. ఎక్స్ వేదికగా భావోద్వేగం..
Ram Mohan Naidu

న్యూఢిల్లీ, మే 23: కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం కుటుంబంతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తల్లి ప్రధాన మంత్రికి మొక్కను బహుకరించారు. కుటుంబంతో కలిసి ప్రధాని మోదీని కలవటంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్‌లో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో.. ‘ఈ రోజు మా కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే ఓ భావోద్వేగ క్షణం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కుటుంబ సమేతంగా కలిసే అదృష్టం కలగడం ఎంతో ఆనందంగా, గర్వంగా భావిస్తున్నాను’..


‘ఆయన అసాధారణ వ్యక్తిత్వం, ఆప్యాయత మా కుటుంబంలోని మూడు తరాలను ఒకేలా ఆకట్టుకుంది. ప్రజల హృదయాల్లో ఆయన ఎందుకు అపారమైన ఆదరణ పొందారో ఆ క్షణంలో మరింత స్పష్టంగా తెలిసింది. ప్రత్యేకంగా.. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ అనే మహత్తర ఆలోచనకు ప్రేరణగా నా తల్లి ప్రధానమంత్రికి మొక్కను బహుకరించడం మా కుటుంబానికి ఎంతో మధురమైన, గర్వకారణమైన క్షణంగా నిలిచిపోతుంది. ఆయన చూపిన ప్రేమ, ఆప్యాయత, ఆశీస్సులకు మేమెప్పటికీ కృతజ్ఞులమే. మాతో గడిపిన అమూల్యమైన సమయానికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

అభిమానికి సారీ చెప్పిన రోహిత్ శర్మ.. ఎందుకంటే?

సాల్ట్‌లేక్ స్టేడియంలోని వివాదాస్పద ఫుట్‌బాల్ శిల్పం కూల్చివేత

Updated Date - May 23 , 2026 | 06:39 PM