Share News

అమరావతికి పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్.. రైతుల త్యాగానికి దక్కిన విజయం: మంత్రి అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Apr 02 , 2026 | 05:19 PM

రాజధాని అమరావతి‌కి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం లభించడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..

అమరావతికి పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్.. రైతుల త్యాగానికి దక్కిన విజయం: మంత్రి అచ్చెన్నాయుడు
Parliament approval Amaravati

అమరావతి, ఏప్రిల్ 2: రాజధాని అమరావతి‌కి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం లభించడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజును ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ‘చరిత్రాత్మక రోజు’ గా ఆయన అభివర్ణించారు. అమరావతి కేవలం ఒక నగరం కాదు.. తెలుగుజాతి గౌరవానికి, రైతుల త్యాగానికి ప్రతీక అని కొనియాడరు.


ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘ప్రజా రాజధాని అమరావతి కోసం 29 వేల మంది రైతులు దాదాపు 33 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారు. వారి త్యాగానికి నేడు పార్లమెంట్ సాక్షిగా న్యాయం జరిగింది. రాజధానిని కాపాడుకోవడానికి 1600 రోజులకు పైగా నిరంతరంగా పోరాటం చేసిన రైతులు, మహిళల ఉద్యమానికి నా సెల్యూట్. గత ప్రభుత్వ హయాంలో మహిళలపై దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. మూడు రాజధానుల పేరుతో గత ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది. అంతేకాదు.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సువర్ణ భవిష్యత్తు ఉంటుంది’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి..

రాజ్యసభలో బీఆర్‌ఎస్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ప్రేమ వివాహం.. నెలరోజులకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 07:42 PM