మణిపాల్ ఆసుపత్రిలో బ్రహ్మం చౌదరిని పరామర్శించిన మంత్రి లోకేశ్
ABN , Publish Date - Jul 22 , 2026 | 08:11 PM
తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ బ్రహ్మం చౌదరిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. బ్రహ్మం చౌదరి యోగ క్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
గుంటూరు, జులై 22: తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ బ్రహ్మం చౌదరిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం పరామర్శించారు. బ్రహ్మం చౌదరి యోగక్షేమాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మం ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మం చౌదరి పూర్తిగా కోలుకున్నారని మంత్రి లోకేశ్‌కు వైద్యులు తెలిపారు. త్వరలో ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ చేస్తామని చెప్పారు. బ్రహ్మం చౌదరి సతీమణి గౌతమి శ్వేతతో మాట్లాడి ఆమెకు మంత్రి లోకేశ్ ధైర్యం చెప్పారు.
హోంమంత్రి వంగలపూడి అనిత కూడా బ్రహ్మం చౌదరిని బుధవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మణిపాల్ ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మం చౌదరితో మాట్లాడి ఆయనకు ధైర్యం చెప్పారు. ఆయన త్వరగా, సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. బ్రహ్మం చౌదరి సతీమణి గౌతమి శ్వేతతో మాట్లాడుతూ.. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. బ్రహ్మం చౌదరి త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుగ్గా పాల్గొనాలని హోంమంత్రి అనిత ఆకాంక్షించారు.