Share News

నంది నాటకోత్సవాలకు రెండ్రోజుల్లో నోటిఫికేషన్‌: మంత్రి దుర్గేశ్

ABN , Publish Date - Sep 18 , 2026 | 03:55 PM

నంది నాటకోత్సవాలకు మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. వచ్చే ఏడాదిలో నంది అవార్డులు కూడా అందజేస్తామని చెప్పారు.

నంది నాటకోత్సవాలకు రెండ్రోజుల్లో నోటిఫికేషన్‌: మంత్రి దుర్గేశ్
kandula Durgesh On Nandi Awards

అమరావతి: నంది నాటకోత్సవాలకు సంబంధించి మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. వచ్చే ఏడాదిలో నంది అవార్డులు అందజేస్తామని చెప్పారు. నంది అవార్డులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని వెల్లడించారు. కందుకూరి వీరేశలింగం జయంతి రోజున నాటక రంగ దినోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు.


నంది నాటకోత్సవాలు జరిగే సమయంలోనే అవార్డులు కూడా అందజేస్తామని మంత్రి తెలిపారు. ఏపీ, తెలంగాణ సంయుక్తంగా అవార్డులు ఇవ్వాలని భావించినప్పటికీ.. రెండు రాష్ట్రాల్లో అవార్డుల తేదీలు వేర్వేరుగా ఉండటంతో అది సాధ్యం కావడం లేదని మంత్రి వివరించారు. ఇతర రాష్ట్రాల్లోని తెలుగు నాటకాలకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. త్వరలోనే అవార్డుల కమిటీని ఏర్పాటు చేస్తామని కందుల దుర్గేశ్ వెల్లడించారు.


Also Read:

ఈగల్ టీమ్ పటిష్ఠ నిఘాతోనే క్రైమ్ రేట్ తగ్గింది: హోం మంత్రి అనిత

అన్ని నియామకాలను స్కాంగా మార్చేశారు.. వైసీపీపై బుద్దా వెంకన్న ఫైర్

Updated Date - Sep 18 , 2026 | 04:45 PM