స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో మంత్రి సంధ్యారాణి ప్రత్యేక కార్యక్రమాలు
ABN , Publish Date - May 30 , 2026 | 06:31 PM
స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంత్రి సంధ్యారాణి సాలూరులో పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఖరీఫ్-2026 సీజన్‌కు రైతులకు భారీ ఎత్తున రాయితీ విత్తనాల పంపిణీని ప్రారంభించారు.
అమరావతి: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సాలూరు మెంటాడ వీధిలోని 1, 2 వార్డుల్లో కాలువలు, వీధుల పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలతో మమేకమవుతూ వీధుల్లో అరుగులపై కూర్చొని మహిళలతో కలిసి కాఫీ తాగారు. ఇంధన పొదుపు కార్యక్రమంలో భాగంగా మంత్రి స్కూటర్‌పై కార్యక్రమ స్థలానికి చేరుకోవడం ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఖరీఫ్-2026 సీజన్‌కు రైతులకు భారీ ఎత్తున రాయితీ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జిల్లాలో ఖరీఫ్ సాగుకు అవసరమైన 22,348 క్వింటాళ్ల వరి విత్తనాలను సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందులో 8,883 క్వింటాళ్ల వరి విత్తనాలను గిరిజన రైతులకు 90 శాతం రాయితీపై అందజేస్తున్నట్లు చెప్పారు. అలాగే పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను ఎస్టీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 50 శాతం రాయితీతో పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.రైతులకు నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయ పరికరాలు, పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో 802 టార్పాలిన్లు, 14 ఆయిల్ ఇంజన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. సాలూరు నియోజకవర్గ రైతులకు 8,100 PMDS కిట్లను కూడా పంపిణీ చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారవంతత పెరగడంతో పాటు భూమిలో తేమ నిల్వ ఉండి, రైతుల ఆదాయం పెరగడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
Also Read:
అంతర్జాతీయ బంగాళాదుంప దినోత్సవం.. ఈ కూరగాయ వెనుక ఉన్న ఆసక్తికర చరిత్ర తెలుసా?
మే 31 నుంచి ధవళేశ్వరం కాలువలకు నీటి విడుదల: మంత్రి కందుల దుర్గేష్