Share News

తొలి రోజు ముగిసిన మహానాడు.. పార్టీకి వెల్లువెత్తిన విరాళాలు

ABN , Publish Date - May 27 , 2026 | 08:13 PM

టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహానాడు తొలి రోజు బుధవారం ముగిసింది. తొలిరోజు మహానాడులో వివిధ తీర్మానాలపై 48 మంది నేతలు ప్రసంగించారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి దాదాపు రూ.12 కోట్లు విరాళంగా నేతలు అందజేశారు.

తొలి రోజు ముగిసిన మహానాడు.. పార్టీకి వెల్లువెత్తిన విరాళాలు
TDP Mahanadu 2026

అమరావతి,మే27: టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహానాడు తొలి రోజు బుధవారం ముగిసింది. తొలిరోజు మహానాడులో వివిధ తీర్మానాలపై 48 మంది నేతలు ప్రసంగించారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి దాదాపు రూ.12 కోట్లు విరాళంగా నేతలు అందజేశారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతలు పార్టీకి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. పార్టీకి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యే భాష్యం రామకృష్ణలు రూ. కోటి చొప్పున విరాళంగా ఇచ్చారు.


అలాగే మహానాడులో తొలిసారి ట్రాన్స్‌జెండర్‌కు ప్రసంగించే అవకాశాన్ని పార్టీ కల్పించింది. ఈ మహానాడు వేదికగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి పీఏ ట్రాన్స్‌జెండర్ వర్షిణీ ప్రసంగించింది. పార్లమెంట్‌ బిల్లుతో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తామని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ ప్రకటనపై సర్వత్రా చర్చ నడుస్తోంది. లోకేష్ తాజా ప్రకటనపై పార్టీలోని నేతలతో పాటూ కేడర్ కూడా స్వాగతిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అలా చేస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటారా? కేటీఆర్‌కు పొంగులేటి సవాల్

లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్

For More AP News And Telugu News

Updated Date - May 27 , 2026 | 08:25 PM