Share News

మాచర్ల అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ సీరియస్..

ABN , Publish Date - Apr 04 , 2026 | 06:28 PM

పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అమానుష ఘటనపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని, బాధిత మహిళను ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

మాచర్ల అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ సీరియస్..
Women Commission Chairperson Rayapati Sailaja

అమరావతి: పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అమానుష ఘటనపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని, బాధిత మహిళను ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బాధితురాలిని కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళా కమిషన్, ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.


నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని పోలీసు అధికారులను మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఆదేశించారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మహిళల భద్రతపై రాజీ పడే ప్రసక్తే లేదని కామాంధులకు హెచ్చరికలు జారీ చేశారు. ఆడవారి జోలికొస్తే ఎంతటి వారైనా ఉపేక్షించమని స్పష్టం చేశారు. మహిళల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చైర్‌పర్సన్ వ్యాఖ్యానించారు. బాధితురాలికి అన్ని విధాలా సహాయం అందించాలని సూచించారు. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో బాధిత మహిళ చికిత్స పొందుతున్నారు.


కాగా, ఏప్రిల్ 2న సాయంత్రం 4గంటల ప్రాంతంలో పల్నాడు జిల్లా మాచర్లలో నివాసం ఉంటున్న ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఇంటికి వెళ్లాడు నిందితుడు. మంచి నీళ్ల నెపంతో తలుపు తప్పి అనంతరం బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించాడు. సదరు మహిళ నోట్లో బట్టలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను కత్తితో గాయపరిచి మర్మాంగాలపైనా రాడ్డుతో దాడి చేశాడు. తీవ్ర రక్తస్త్రావంతో బాధితురాలు ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

అమరావతి రాజధానిగా.. ఏపీ కొత్త మ్యాప్ ఇదే..

నిర్లక్ష్యపు ధోరణి సహించను.. కాంట్రాక్టర్లపై చంద్రబాబు సీరియస్..

Updated Date - Apr 04 , 2026 | 06:30 PM