అమరావతి రాజధానిగా.. ఏపీ కొత్త మ్యాప్ ఇదే..
ABN , Publish Date - Apr 04 , 2026 | 05:31 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర నూతన మ్యాప్‌ను విపత్తు నిర్వహణ శాఖ విడుదల చేసింది. మొత్తం 28 జిల్లాలతో కూడిన ఈ మ్యాప్‌ను ఈ నెల 2వ తేదీన ప్రచురించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
అమరావతి, ఏప్రిల్4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర నూతన మ్యాప్‌ను విపత్తు నిర్వహణ శాఖ విడుదల చేసింది. మొత్తం 28 జిల్లాలతో కూడిన ఈ అధికారిక మ్యాప్‌ను ఈ నెల 2వ తేదీన ప్రచురించారు. ఇందులో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే.. రాజధాని అమరావతి ప్రస్తావన, కొత్తగా ఏర్పడిన జిల్లాల సరిహద్దులను స్పష్టంగా పొందుపరిచారు.
అమరావతికి రాజధానిగా ప్రత్యేక గుర్తింపు..
ఈ నూతన మ్యాప్‌లో రాజధాని అమరావతిని ప్రత్యేకంగా హైలెట్ చేశారు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల సరిహద్దుల మధ్యలో అమరావతిని ‘రాష్ట్ర రాజధాని’ గా చూపుతూ మ్యాప్‌ను రూపొందించారు. అయితే అమరావతికి ప్రత్యేక బౌండరీలను కేటాయించకుండానే, ఆ ప్రాంతాన్ని రాజధానిగా గుర్తించడం గమనార్హం. ఈ నూతన మ్యాప్‌లో రాజధాని అమరావతిని ప్రత్యేకంగా హైలైట్ చేశారు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల సరిహద్దుల మధ్యలో అమరావతిని.. రాష్ట్ర రాజధానిగా (Capital) చూపుతూ మ్యాప్‌ను రూపొందించారు.
ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేసేందుకు.. గతంలో ఉన్న 26 జిల్లాలకు అదనంగా.. ఇటీవల మార్కాపురం, పోలవరం అనే రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు జిల్లాల సరిహద్దులను కూడా తాజా మ్యాప్‌లో తెలియజేశారు. దీంతో ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరింది. రాష్ట్ర విపత్తు నిర్వాహణ శాఖ ఈ మ్యాప్‌ను విడుదల చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం.. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో జిల్లాల వారీగా సహాయక చర్యలు చేపట్టడానికి స్పష్టమైన భౌగోళిక సమాచారం ఉండటమే. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత సరిహద్దుల విషయంలో ఉన్న సందిగ్ధతను ఈ మ్యాప్ తొలగించనుంది.
ఇవి కూడా చదవండి...
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేది కలే: భాను ప్రకాశ్ రెడ్డి
రాజధాని పనులు.. వారంతా చరిత్రలో భాగస్వాములే: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News