గుమ్మడి గోపాలకృష్ణకు సంగీత నాటక అకాడమీ అవార్డు.. సీఎం చంద్రబాబు హర్షం..
ABN , Publish Date - Aug 13 , 2026 | 09:40 PM
ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్ గుమ్మడి గోపాలకృష్ణకు ప్రతిష్ఠాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు లభించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. 2024 సంవత్సరానికి థియేటర్ నటనా విభాగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.
అమరావతి: ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్ గుమ్మడి గోపాలకృష్ణకు ప్రతిష్ఠాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు లభించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. 2024 సంవత్సరానికి థియేటర్ నటనా విభాగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గుమ్మడి గోపాలకృష్ణను అభినందిస్తూ తెలుగు నాటక రంగానికి చేసిన సేవలను ప్రశంసించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు పోస్టు పెట్టారు.
సీఎం చంద్రబాబు ఎక్స్ పోస్టు..
‘భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా 2024 సంవత్సరానికి థియేటర్ నటనా విభాగంలో ప్రతిష్ఠాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న శ్రీ గుమ్మడి గోపాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు నాటక రంగానికి, ముఖ్యంగా పద్య నాటక సంప్రదాయానికి మీరు అందిస్తున్న విశిష్ట సేవలకు ఈ జాతీయ పురస్కారం సముచిత గుర్తింపు. ఎన్నో పౌరాణిక పాత్రలను మీ నటనా కౌశలంతో ఆవిష్కరించారు. తెలుగు నాటక వైభవాన్ని దేశ, విదేశాల్లో చాటిన మీకు ఈ సందర్భంగా శుభాభినందనలు’ అంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..
రాజధాని అమరావతిపై న్యూయార్క్ టైమ్స్‌లో కథనం.. సీఎం చంద్రబాబు హర్షం..