రాజధాని అమరావతిపై న్యూయార్క్ టైమ్స్‌లో కథనం.. సీఎం చంద్రబాబు హర్షం..
ABN , Publish Date - Aug 13 , 2026 | 08:06 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన కథనంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజధాని అభివృద్ధి దృక్పథాన్ని న్యూయార్క్ టైమ్స్‌లో ప్రస్తావించడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన కథనంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. అమరావతిని కేవలం రాజధానిగా కాకుండా భారతదేశంలో జీవన ప్రమాణాలకు కొత్త బెంచ్‌మార్క్‌గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ఆకాంక్షని సీఎం పేర్కొన్నారు. అమరావతి పచ్చదనం, సమర్థత, సమ్మిళితత్వంతో కూడిన నగరంగా రూపుదిద్దుకోవాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజల రోజువారీ జీవన నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ అమరావతి నిర్మాణం జరుగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. భారత్‌లో ప్రపంచస్థాయి పట్టణ జీవనం సాధ్యమేనని అమరావతి నిరూపిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు అమరావతి అభివృద్ధి లక్ష్యాలను ప్రశంసిస్తూ న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని తన ఎక్స్ పోస్టుకు ఆయన జత చేశారు. ఈ సందర్భంగా రాజధాని అభివృద్ధి దృక్పథాన్ని న్యూయార్క్ టైమ్స్‌లో ప్రస్తావించడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. భారతదేశానికే అమరావతి ఆదర్శంగా నిలవాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
కాగా, అమరావతి నిర్మాణంపై న్యూయార్క్ టైమ్స్ కీలక కథనం ప్రచురించింది. ఏపీ రాజధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మద్దతు ఉందని ఆ కథనం పేర్కొంది. అమరావతిలో రోజూ 25 వేల మందికి పైగా నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించింది. ప్రముఖ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ రూపకల్పనలో అమరావతి నగర నిర్మాణం సాగుతోందని తెలిపింది. ప్రభుత్వ భవనాలతో పాటు సుమారు ఐదు మైళ్ల మేర విస్తరించే ప్రభుత్వ కార్యాలయాల సముదాయం సిద్ధమవుతోందని చెప్పుకొచ్చింది. అలాగే, అమరావతి నిర్మాణాన్ని నిర్ణీత కాలంలో పూర్తి చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుందని ప్రస్తావించింది. 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పనులను వేగవంతం చేస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి
డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..
అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..