Share News

నిరుద్యోగులకు మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్.. నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌ విడుదల..!

ABN , Publish Date - Oct 01 , 2026 | 08:54 PM

డీఎస్సీ ఆశావహులకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

నిరుద్యోగులకు మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్.. నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌ విడుదల..!
Minister Nara Lokesh

అమరావతి: డీఎస్సీ ఆశావహులకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. విద్యాశాఖ అధికారులతో లోకేశ్ ఇవాళ (గురువారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు చెప్పారు.


మరోవైపు, రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 స్కూళ్లను గుర్తించి 'లీప్ స్కూల్స్'గా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా 'మిషన్ మార్చ్' అమలు చేయాలన్నారు. ముఖ్యంగా డ్రాప్‌అవుట్స్‌పై దృష్టి సారించాలని సూచించారు. ఇందుకు సింగపూర్ మంత్రి షణ్ముగం సూచనను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యాశాఖలో రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలు విధివిధానాలపైనా మంత్రి లోకేశ్ సమీక్షించారు.


ఈ సందర్భంగా ఏపీలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో అధ్యాపక పోస్టుల అంశం చర్చకు వచ్చింది. యూనివర్సిటీల పరిధిలోని 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి పకడ్బందీ చర్యలు చేపట్టాలని లోకేశ్ ఆదేశించారు. అయితే, అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ పూర్తైందని, డిసెంబర్‌లో రాత పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తుందని మంత్రికి ఉన్నత విద్య డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు.


అలాగే, రాష్ట్రంలో క్యాంపస్‌ల ఏర్పాటుకు జేఎస్ఎస్, థాపర్, యూపీఈఎస్, జేయూఎస్, బెన్నెట్, సవిత వంటి యూనివర్సిటీలు ఆసక్తి చూపుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థల క్యాంపస్‌ల ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించాలని, త్వరితగతిన నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. మరోవైపు, ఏయూ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో విశాఖలో ప్రతిష్టాత్మకంగా గ్రంథాలయం నిర్మించాలని నిర్ణయించారు.


ఈ వార్తలు కూడా చదవండి

బాలుడు రామయ్య ఆచూకీ లభ్యం.. తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేర్చాం: మంత్రి లోకేశ్..

బీసీ హాస్టళ్లు, గురుకులాల డైట్ ఛార్జీల పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Updated Date - Oct 01 , 2026 | 09:52 PM