ఆక్వాన్ తుపానుపై సీఎం చంద్రబాబు అలర్ట్.. అధికారులకు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Nov 16 , 2026 | 06:18 PM
ఆర్నబ్ తరహాలోనే ఆక్వాన్ తుపాను ప్రభావం ఉండనున్న నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
అమరావతి, నవంబర్ 16: ఆర్నబ్ తరహాలోనే ఆక్వాన్ తుపాను ప్రభావం ఉండనున్న నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కేంద్ర బృందం చేసిన సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని వారికి సూచించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంపై ఆయన సమీక్షించారు. ఈ రోజు సాయంత్రానికి వాయుగుండం.. తుపానుగా బలపడే సూచనలు ఉన్నట్లు సీఎంకు అధికారులు వివరించారు.
నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కోనసీమ, కాకినాడ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు సహా వివిధ జిల్లాల్లో ఈ తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆర్నబ్ తరహాలోనే ఈ తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉందని సీఎం దృష్టికి వారు తీసుకెళ్లారు. దాంతో సీఎం చంద్రబాబు పైవిధంగా ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉదయం నడక, సాయంత్రం నడక.. వీటిలో ఏది ఆరోగ్యానికి మేలు..?
జీవితంలో ఎదగాలంటే..? నాలుగు సింపుల్ సూపర్ టిప్స్..