కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరిని పరామర్శించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 08 , 2026 | 07:47 PM
కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల అస్వస్థతకు గురై చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆయన్ని సీఎం కలిశారు.
అమరావతి: కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల అస్వస్థతకు గురై చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆయన్ని సీఎం కలిశారు. తాడేపల్లిలోని బ్రహ్మం నివాసానికి వెళ్లి చంద్రబాబు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడొద్దని, టీడీపీ, తాను అండగా ఉంటామని బ్రహ్మం చౌదరికి, ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఆయన పూర్తిగా కోలుకునే వరకు పర్యవేక్షించాలని వైద్యులకు సూచించారు.
కాగా, కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం జులై 17న అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు నిర్ధారించి చికిత్స అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సహా పార్టీ నేతలంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బ్రహ్మం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును సీఎం ఆదేశించారు. మరోవైపు, పలువురు నేతలు ఆస్పత్రికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. కాగా, చికిత్స అనంతరం తన నివాసానికి వచ్చిన బ్రహ్మం చౌదరిని సీఎం చంద్రబాబు నేడు పరామర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ముమ్మరంగా కొనసాగుతున్న ఆపరేషన్ గజ..
'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు ఎంఎస్ఎంఈ బిల్లు పెద్దపీట వేస్తోంది: మంత్రి కొండపల్లి