Share News

అంబటి రాంబాబుపై మంత్రుల ఆగ్రహం..

ABN , Publish Date - Jan 31 , 2026 | 08:32 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విమర్శలకు దారితీశాయి. అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రాష్ట్ర మంత్రులు.. ఇది సభ్య సమాజాన్ని అవమానించే విధంగా ఉందని మండిపడ్డారు..

అంబటి రాంబాబుపై మంత్రుల ఆగ్రహం..
Ministers Reaction On Ambati Rambabu

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రాష్ట్ర మంత్రులు.. అంబటి వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని అవమానించే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే..

హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. అంబటి రాంబాబు వ్యాఖ్యలు అత్యంత నీచమైనవని అన్నారు. సీఎం చంద్రబాబు లాంటి నిబద్ధత కలిగిన నాయకుడిపై ఇష్టానుసారంగా మాట్లాడటం సహించబోమని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలు.. రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఇది డైవర్షన్ రాజకీయాలేనని విమర్శించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి పెడుతుంటే.. వైసీపీ నేతలు అనవసర వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని తెలిపారు.

పోలీసులపై కూడా అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలిపారు. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, ప్రజల భద్రతతో ఎలాంటి రాజీ ఉండదని తేల్చి చెప్పారు. రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని, వాటిని దాటి మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టమైన సంకేతం ఇచ్చారు.


వైసీపీ నేతల తీరు ఇంకా మారలేదు..

సీఎం చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని మంత్రి నారాయణ అన్నారు. చంద్రబాబుకి అంబటి రాంబాబు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల తీరు మారలేదని, వైసీపీ నేతలు తీరు మార్చుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.

వైసీపీని ప్రజలు క్షమించరు..

కల్తీ నెయ్యి కుంభకోణం బయటపడడంతో వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని మంత్రి వాసంసెట్టి సుభాష్ ఫైర్ అయ్యారు. అందులో భాగంగానే చంద్రబాబుపై ఇష్టనుసారంగా అంబటితో బూతులు మాట్లాడించారన్నారు. వైసీపీని ప్రజలు క్షమించరని, తిరుపతి వెంకన్న స్వామి శాపం కచ్చితంగా వైసీపీకి తగులుతుందని మండిపడ్డారు.


Also Read:

నేను ఇంత పెద్ద వయస్సులో అలా మాట్లాడకుండా ఉండాల్సింది: అంబటి రాంబాబు

జగన్ హయాంలో నల్లచట్టం తెచ్చారు: సీఎం చంద్రబాబు

For More Latest News

Updated Date - Jan 31 , 2026 | 08:59 PM