నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
ABN , Publish Date - Jan 27 , 2026 | 08:30 PM
ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్, కండక్టర్ సహా ఇతర విభాగాల ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ పాలకమండలి తీర్మానం చేసింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి చర్యలు ప్రారంభించింది. మొత్తం 7,673 రెగ్యులర్ పోస్టుల నియామకానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ కోరింది. ఈ మేరకు ఆర్టీసీ పాలకమండలి సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఖాళీల్లో ప్రధానంగా 3,673 డ్రైవర్ పోస్టులు, 1,813 కండక్టర్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు డిపోలలో అవసరమైన మెకానిక్‌లు, శ్రామిక్‌లు, ఇతర సాంకేతిక విభాగాల ఉద్యోగాల భర్తీకి కూడా అనుమతి ఇవ్వాలని బోర్డు ప్రభుత్వాన్ని కోరింది.
ఇదే సమావేశంలో కార్మికులకు సంబంధించి మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆన్‌కాల్ డ్రైవర్లకు అందిస్తున్న రోజువారీ వేతనాన్ని రూ.800 నుంచి రూ.1,000కు పెంచాలని నిర్ణయించారు. అలాగే డబుల్ డ్యూటీ నిర్వహిస్తున్న కండక్టర్లకు చెల్లించే మొత్తాన్ని రూ.900కు పెంచేందుకు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయాలతో ఆర్టీసీ సేవలు మరింత మెరుగుపడతాయని, ఉద్యోగులపై పని భారం తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:
ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే
అది టీడీపీ రక్తంలోనే లేదు.. అంతా చంద్రబాబు సైనికులమే: లోకేశ్
Read Latest AP News And Telugu News