Share News

ఏపీ వక్ఫ్ బోర్డ్ చరిత్రలో సువర్ణ అధ్యాయం ప్రారంభం: అబ్దుల్ అజీజ్

ABN , Publish Date - Jul 17 , 2026 | 09:37 PM

ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ చరిత్రలో సువర్ణ అధ్యాయం మొదలైందని ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభించిందని తెలిపారు.

ఏపీ వక్ఫ్ బోర్డ్ చరిత్రలో సువర్ణ అధ్యాయం ప్రారంభం: అబ్దుల్ అజీజ్
AP Waqf Board

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ చరిత్రలో సువర్ణ అధ్యాయం మొదలైందని ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభించిందని తెలిపారు. తెలంగాణ వక్ఫ్ బోర్డు నుంచి ఏపీ వక్ఫ్ బోర్డుకు రికార్డులు బదిలీ అయ్యాయని ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ వెల్లడించారు.


79 బండిళ్లలోని 3,503 ఫైళ్లు, 4,050 సర్వే కమిషనర్ నివేదికలు, రెండు అధికారిక గెజిట్ సంపుటాలు సహా కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ.55 కోట్ల బకాయిలు కూడా త్వరలో విడుదల కానున్నాయని తెలిపారు. పట్టుదల, నిరంతర ప్రయత్నంతో రికార్డుల బదిలీ సాధించామని ఆయన చెప్పారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఇది కీలక మైలురాయిగా నిలిచిందన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, ఎన్.ఎం.డి.ఫరూక్ సహకారంతో ఈ విజయం సాధించామని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అంగన్‌వాడీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

ఇతడి టాలెంట్ ముందు కంప్యూటర్ కూడా దిగదుడుపే.. వీడియో వైరల్..

Updated Date - Jul 17 , 2026 | 09:38 PM