Share News

గుడ్ న్యూస్.. ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Jul 27 , 2026 | 01:53 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించనున్నట్లు తెలిపారు. ఏపీ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు జరగనున్నట్లు పవన్ పేర్కొన్నారు.

గుడ్ న్యూస్.. ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం: పవన్ కల్యాణ్
AP Deputy CM Pawan Kalyan

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించనున్నట్లు తెలిపారు. ఏపీ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు జరగనున్నట్లు పవన్ పేర్కొన్నారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ రూ.52, పచ్చి బియ్యం కేజీ రూ.50కి అందజేయడంతో సామాన్యులకు ఊరట లభించనుందని తెలిపారు. ఏపీ ప్రజలకు అండగా ఉండేందుకే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎంవో కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.


డిప్యూటీ సీఎంవో ఎక్స్ పోస్టు..

‘కూటమి ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలుస్తుందని చాటి చెప్పేలా ఏపీ పౌర సరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. బహిరంగ మార్కెట్‌లో పెరుగుతున్న బియ్యం ధరల నుంచి సామాన్యులకు సాంత్వన చేకూర్చేలా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు చేపట్టడం హర్షణీయం. ఆగస్టు 1 నుంచి ఏపీలోని 130 రైతుబజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో బియ్యం అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశారు.


బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ రూ.52కు, గ్రేడ్-1 పచ్చి బియ్యం (రా రైస్) కేజీ రూ.50కి అందించనున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. సామాన్యులపై ధరల భారం పడకుండా కూటమి ప్రభుత్వం తరఫున ఆయన ప్రత్యేకంగా చొరవ తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నా. బహిరంగ మార్కెట్ ధరలను సమీక్షించి, మిల్లర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా ధరలను నిర్ణయించాం. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ పాలనాపరమైన నిర్ణయం సామాన్య ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని విశ్వసిస్తున్నా’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్టు మణిహారం: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

పోలవరం జిల్లాలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

Updated Date - Jul 27 , 2026 | 03:04 PM