మెగా డీఎస్సీ-2025 రిక్రూట్మెంట్‌పై చేసేదంతా తప్పుడు ప్రచారమే: ఎస్.ఎస్.రావత్
ABN , Publish Date - Jun 05 , 2026 | 07:27 PM
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ-2025 రిక్రూట్మెంట్‌పై తప్పుడు ప్రచారాలు జరుగుతుండటంపై సంబంధిత అధికారులు స్పందించారు. ఉద్యోగ నియామకాలపై అవాస్తవాలను తప్పుబడుతూ జీఏడీ, విద్యాశాఖ, క్రీడాశాఖల ఉన్నతాధికారులు ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ-2025 రిక్రూట్మెంట్‌పై తప్పుడు ప్రచారాలు జరుగుతుండటంపై సంబంధిత అధికారులు స్పందించారు. ఉద్యోగ నియామకాలపై అవాస్తవాలను తప్పుబడుతూ జీఏడీ, విద్యాశాఖ, క్రీడాశాఖల ఉన్నతాధికారులు ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్సీ నియామకాలపై అసత్య ప్రచారాలకు చెక్ పెడుతూ కీలక విషయాలను వెల్లడించారు.
హారిజాంటల్ రిజర్వేషన్లకు సంబంధించి గత ప్రభుత్వం జీవో జారీ చేసిందని జీఏడీ-సర్వీసెస్ స్పెషల్ సీఎస్ ఎస్.ఎస్.రావత్ తెలిపారు. ఆ జీవో ఆధారంగానే డీఎస్సీ-2025 రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపట్టారని ఆయన వెల్లడించారు. కొత్త విధానంలో తొలిసారి భారీ నియామకాలు చేపట్టడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఎస్.ఎస్.రావత్ మీడియాతో మాట్లాడుతూ.. 'గత కొన్ని రోజులుగా హారిజాంటల్ రిజర్వేషన్ల విషయంలో గందరగోళం కలిగించే అంశాలు ప్రచారం చేస్తున్నారు.
వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ల అమలు విధానం వేర్వేరుగా ఉంటుంది. హారిజాంటల్ రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలు రూపొందించి 2023 ఆగస్టు 2న జీవో నంబర్ 77 జారీ చేశారు. ఈ కొత్త పద్ధతి ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్లకు ఫిక్స్‌డ్ రోస్టర్ పాయింట్లు ఉండవు. మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్ విధానాన్ని ఈ నిబంధనల ప్రకారమే రూపొందించారు. దీంతో అభ్యర్థులు గందరగోళానికి గురై ఉండొచ్చు. హారిజాంటల్ రిజర్వేషన్లపై కొత్త నిబంధనలు అమలు చేస్తూ ఇంత పెద్దఎత్తున రిక్రూట్మెంట్ చేపట్టడం ఇదే తొలిసారి' అని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎంపీ కేశినేని శివనాథ్‌పై అసత్య ప్రచారాలు.. ఒకరి అరెస్ట్
ఏపీలో పలువురు నాన్ క్యాడర్ ఎస్పీల బదిలీ