ఏపీలో పలువురు నాన్ క్యాడర్ ఎస్పీల బదిలీ
ABN , Publish Date - Jun 05 , 2026 | 06:17 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఎస్పీ (నాన్ క్యాడర్) అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఎస్పీ (నాన్ క్యాడర్) అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఓ. దిలీప్ కిరణ్‌ను ఇంటెలిజెన్స్ విభాగానికి నియమించారు. టీ.టి. ప్రభాకర్‌బాబును సీఐడీ మహిళా రక్షణ సెల్‌కు పోస్టింగ్ ఇచ్చారు. డాక్టర్ వి.బి.ఆర్ రాజ్ కమల్‌ను కూడా ఇంటెలిజెన్స్ విభాగంలో నియమించారు.
అదేవిధంగా కె. శ్రావణిని మెరైన్ విభాగానికి నియమించగా, డి. శ్రీ భవాని హర్షను పీఆర్ అండ్ ఆర్‌డీ శాఖ సీవోవోగా కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. కె. శ్రీలక్ష్మికి సీఐడీ యూఆర్‌సీసీ విభాగంలో కొత్త బాధ్యతలు అప్పగించారు. జే. రమేష్ రెడ్డిని సైబర్ క్రైమ్ విభాగానికి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ పోస్టును మార్పు చేసి సైబర్ క్రైమ్ విభాగానికి కేటాయించారు. ఈ బదిలీలకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Also Read:
టీఎంసీలో చిచ్చు... రెబల్ ఎమ్మెల్యేలతో 23 మంది ఎంపీల మంతనాలు
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు