Share News

అరుదైన వ్యాధిగ్రస్థులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక పాలసీపై కూటమి ప్రభుత్వం కసరత్తు..

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:32 PM

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అరుదైన వ్యాధిగ్రస్థులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రత్యేక పాలసీ రూపొందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

అరుదైన వ్యాధిగ్రస్థులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక పాలసీపై కూటమి ప్రభుత్వం కసరత్తు..
Minister Satya Kumar Yadav

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అరుదైన వ్యాధిగ్రస్థులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రత్యేక పాలసీ రూపొందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. 'నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్-2021'కు అనుగుణంగా నూతన పాలసీని త్వరగా తయారు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.


ఇందులో భాగంగా ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్య సేవలు, బాధితులకు తోడ్పాటును అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ చెప్పారు. అలాగే మూడు రిఫరల్ కేంద్రాలు, ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. రేర్ డిసీజెస్ రిజిస్ట్రీ ఏర్పాటు, వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


మరోవైపు పాలసీ తయారీపై సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు సత్యకుమార్ తెలిపారు. మంత్రి లోకేశ్ చొరవ తీసుకుని పాలసీ తయారీకి సలహాలు, సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. అతి త్వరలో పాలసీని రూపొందించి అరుదైన వ్యాధిగ్రస్థులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి సత్యకుమార్ ధీమా వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

సాయికృష్ణ అదృశ్యం కేసు.. శ్మశానవాటికలో పోలీసుల విచారణ

అమరావతిని చాలా బాగా అభివృద్ధి చేశారు.. సీఎం చంద్రబాబుపై బాబా రామ్‌దేవ్ ప్రశంసలు

Updated Date - Jun 20 , 2026 | 05:09 PM