Share News

సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ కానున్న క్యాబినెట్.. చర్చించే కీలక అంశాలివే..

ABN , Publish Date - Nov 26 , 2026 | 07:52 PM

ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి శుక్రవారం ఉదయం 10:30 గంటలకు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ కానున్న క్యాబినెట్.. చర్చించే కీలక అంశాలివే..
AP Cabinet Meet

అమరావతి, నవంబర్ 26: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి శుక్రవారం ఉదయం 10:30 గంటలకు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సందర్భంగా రూ.88,392 కోట్ల పెట్టుబడులతో పాటు ఉద్యోగాల కల్పన, హైపర్‌స్కేల్ డేటా సెంటర్, అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ వంటి కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.


ముఖ్యంగా ఏపీకి పెట్టుబడుల ద్వారా వచ్చిన రూ.88,392 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. 18 ప్రాజెక్టుల ద్వారా 54,210 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిర్ణయం తీసుకోనుంది. అలాగే, శ్రీసత్యసాయి జిల్లాలో రూ.19 వేల కోట్లతో కియా పరిశ్రమ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దీని ద్వారా మరో 12 వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. అనకాపల్లి జిల్లా తూటిపాలలో రూ.47,009 కోట్లతో భారీ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ నిర్మాణానికి పచ్చజెండా ఊపనుంది. రాజధాని అమరావతిలో రూ.1,921 కోట్లకు పైగా విలువైన కీలక అభివృద్ధి పనులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అమరావతి పరిధిలోని 26 గ్రామాల్లో రూ.1,215.70 కోట్లతో రహదారులు, డ్రెయిన్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపనుంది.


మరోవైపు, అమరావతిలో రూ.80 కోట్లతో గ్రీనరీ అభివృద్ధి పనులకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. రూ.626.14 కోట్లతో అమరావతి సంగమం ప్రాజెక్టుతో పాటు, అమరావతిలో పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ భవన నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధాని ప్రాంతంలో ఐదు కీలక రహదారుల అభివృద్ధికి సంబంధించిన ఏఐఐబీ (AIIB) నిధుల వినియోగానికి ఆమోదం తెలపనుంది. ఎల్‌పీఎస్ (LPS) జోన్-10లో మౌలిక వసతుల అభివృద్ధికి ఏఐఐబీ ఆర్థిక సహకారానికి కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్, జంట టవర్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని సీఆర్‌డీఏకు మళ్లించేందుకు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏపీ క్యాపిటల్ రీజియన్ పరిధిలో బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది.


ఈ వార్తలు కూడా చదవండి

డిసెంబర్‌లో నంది అవార్డుల వేడుక.. భారీ ఏర్పాట్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాల విరాళం.. జైన్ దంపతులకు చంద్రబాబు అభినందనలు

Updated Date - Nov 26 , 2026 | 07:56 PM