Share News

మే 22న ప్రారంభం కానున్న SAEL.. ఎక్స్ వేదికగా చంద్రబాబు, లోకేశ్ పోస్టు..

ABN , Publish Date - May 20 , 2026 | 07:45 PM

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే క్లీన్ ఎనర్జీ హబ్‌గా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024' కింద తొలి భారీ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి అయ్యింది.

మే 22న ప్రారంభం కానున్న SAEL.. ఎక్స్ వేదికగా చంద్రబాబు, లోకేశ్ పోస్టు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే క్లీన్ ఎనర్జీ హబ్‌గా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024' కింద తొలి భారీ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి అయ్యింది. రాయలసీమలో SAEL సంస్థ ఏర్పాటు చేసిన 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రికార్డు స్థాయిలో కేవలం 11 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసుకుని.. ఈ నెల 22న ప్రారంభం కానుంది. కాగా, ఈ ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మక విజయంగా నిలిచింది.


ఈ ప్రాజెక్టుపై స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని సీఎం చంద్రబాబు అన్నారు. రూ.3 వేల కోట్ల పెట్టుబడితో నిర్మించి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు రాష్ట్రంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, ప్రభుత్వ వేగవంతమైన నిర్ణయ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశ స్వచ్ఛ ఇంధన రాజధానిగా నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.


మరోవైపు SAEL నిర్మాణం పూర్తి కావడంపై మంత్రి లోకేశ్ స్పందించారు. రూ.3 వేల కోట్ల పెట్టుబడి, 600 మెగావాట్ల సామర్థ్యంతో రికార్డు స్థాయిలో ప్రాజెక్టు నిర్మించినట్లు మంత్రి తెలిపారు. కేవలం 11 నెలల్లో పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు. SAEL భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టు మే 22న రాయలసీమలో ప్రారంభం కానుందన్నారు. 'ఆంధ్రప్రదేశ్‌లో మేము కేవలం ప్రాజెక్టులకు శంకుస్థాపనలు మాత్రమే చేయము, రికార్డులనూ బద్దలు కొడతాం' అంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.


కాగా, రాయలసీమలో SAEL ఏర్పాటు చేసిన ఈ మెగా సోలార్ ప్రాజెక్టుతో భారీ స్థాయిలో గ్రీన్ పవర్ ఉత్పత్తి జరగనుంది. దీంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం

స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు

Updated Date - May 20 , 2026 | 07:49 PM