ముగిసిన సీఆర్డీయే 63వ అథారిటీ సమావేశం.. కీలక నిర్ణయాలు ఇవే..
ABN , Publish Date - Jul 07 , 2026 | 06:20 PM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో సీఆర్డీఏ 63వ అథారిటీ సమావేశం ఇవాళ (మంగళవారం) జరిగింది. ఈ సమావేశంలో అమరావతి అభివృద్ధి, రెండో దశ ల్యాండ్ పూలింగ్, రైతులకు యాన్యుటీ, వివిధ సంస్థలకు భూ కేటాయింపులు సహా పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో సీఆర్డీఏ 63వ అథారిటీ సమావేశం ఇవాళ (మంగళవారం) జరిగింది. ఈ సమావేశంలో ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, సీఎస్ సాయిప్రసాద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి, రెండో దశ ల్యాండ్ పూలింగ్, రైతులకు యాన్యుటీ, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు, వివిధ సంస్థలకు భూ కేటాయింపులు సహా తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.
సమావేశం అనంతరం మీడియాకు మంత్రి నారాయణ వివరాలు వెల్లడించారు. 2024 జూన్ 12 నుంచి రెండో దశ ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు ఎకరానికి వార్షిక యాన్యుటీగా రూ.40 వేల చొప్పున చెల్లించేందుకు అథారిటీ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. భూములు అప్పగించిన తేదీ నుంచి పదేళ్లపాటు ఈ యాన్యుటీ అమల్లో ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ప్రతి ఏడాది జరీబు భూములకు ఎకరానికి రూ.5 వేల చొప్పున, మెట్ట భూములకు ఎకరానికి రూ.3 వేల చొప్పున యాన్యుటీ పెంపునకూ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. గ్రామ కంఠాల్లో భూములు కోల్పోయిన వారికి ఏడాదికి రూ.10 వేల చొప్పున చెల్లించాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.
కొత్తగా ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న గ్రామాల్లో భూములు ఇచ్చే రైతు కుటుంబాలకు వ్యవసాయ రుణమాఫీ అమలు చేయాలని అథారిటీ నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. 2026 జనవరి 6 లోపు తీసుకున్న వ్యవసాయ రుణాలకు ఈ నిర్ణయం వర్తించేలా అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. ఇనాం భూములకు సంబంధించి దేవదాయ శాఖకు రూ.159 కోట్లు చెల్లించేందుకూ ఈ సమావేశంలో పచ్చజెండా ఊపినట్లు ఆయన పేర్కొన్నారు. అమరావతిలో అభివృద్ధి చేస్తున్న 25 టౌన్‌షిప్‌లలో ప్రతి దాంట్లోనూ తప్పనిసరిగా ఒక అంతర్జాతీయ పాఠశాల ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.
ల్యాండ్ పూలింగ్‌కు ఇంకా భూములు ఇవ్వని రైతులకు మంగళవారం రాత్రి వరకు అవకాశం కల్పిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఆ తర్వాతా భూములు ఇవ్వకపోతే బుధవారం నుంచి భూసేకరణ ప్రక్రియను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే జారీ చేసిన ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్‌ను 2.5 ఎకరాల భూమికీ అమలు చేయనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
సంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఏపీ పుట్టినిల్లు: పవన్ కల్యాణ్