ఐఎన్‌ఐ-సెట్‌లో గుంటూరు విద్యార్థినికి 5వ ర్యాంకు
ABN , Publish Date - Nov 08 , 2026 | 01:43 AM
జాతీయస్థాయిలో నిర్వహించిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్‌ఐ-సెట్)లో గుంటూరుకు చెందిన సోమేపల్లి నాగ సింధు ఐదో ర్యాంకు సాధించారు.
గుంటూరు (తూర్పు), నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయిలో నిర్వహించిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్‌ఐ-సెట్)లో గుంటూరుకు చెందిన సోమేపల్లి నాగ సింధు ఐదో ర్యాంకు సాధించారు. దేశవ్యాప్తంగా సుమారు 62 వేల మంది వైద్యులు పోటీపడిన ఈ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. నాగ సింధు గుంటూరులోని ఎన్నారై అకాడమీలో ఇంటర్మీడియట్, భువనేశ్వర్ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆమె తండ్రి సోమేపల్లి మార్కండేయులు న్యాయవాదిగా, తల్లి నిర్మల ఎన్నారై అకాడమీలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఎంఎస్ జనరల్ మెడిసన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నాగ సింధు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..