రాష్ట్రంలో జీఎస్ఎల్ షిప్‌యార్డ్
ABN , Publish Date - Sep 17 , 2026 | 02:54 AM
రాష్ట్రానికి కేంద్ర రక్షణ రంగానికి చెందిన సంస్థ గోవా షిప్‌యార్డు లిమిటెడ్ (జీఎస్ఎల్) రానుంది. మచిలీపట్నంలో రూ.8000 కోట్లతో షిప్‌యార్డ్ వర్క్‌షాప్ బిల్డింగ్ యూనిట్ స్థాపించనుంది. ఇప్పటికే ఈ సంస్థ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) ఆమోదం తెలిపింది.
మచిలీపట్నంలో 8 వేల కోట్లతో ఏర్పాటుకు సిద్ధం
విశాఖకు డెలాయిట్.. 2,400 మందికి ఉద్యోగాలు
ఐటీ సంస్థ ఏర్పాటుకు ముందుకొచ్చిన ముత్తూట్
పలు సంస్థల ప్రతిపాదనలకు ఎస్‌ఐపీసీ ఆమోదం
రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ భేటీ
అమరావతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి కేంద్ర రక్షణ రంగానికి చెందిన సంస్థ గోవా షిప్‌యార్డు లిమిటెడ్ (జీఎస్ఎల్) రానుంది. మచిలీపట్నంలో రూ.8000 కోట్లతో షిప్‌యార్డ్ వర్క్‌షాప్ బిల్డింగ్ యూనిట్ స్థాపించనుంది. ఇప్పటికే ఈ సంస్థ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) ఆమోదం తెలిపింది. జీఎస్‌ఎల్ నిర్మించే వర్క్‌షాప్ బిల్డింగ్ ఫెసిలిటీ కోసం ప్రభుత్వం 400 ఎకరాలు కేటాయించనుంది. ఇక ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ప్రముఖ సంస్థ డెలాయిట్ విశాఖలో తమ కార్యకలాపాలు చేపడతామని, 2,500 మందికి ఉద్యోగాలను కల్పిస్తామని ప్రతిపాదించింది.
ఇందుకోసం విశాఖ ఐటీ సెజ్‌లో తగినంత భూములను కేటాయించాలని కోరింది. ఇప్పటిదాకా బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహిస్తున్న ముత్తూట్ సంస్థ కూడా విశాఖలో ఐటీ కార్యకలాపాలను ప్రారంభిస్తామని, 2వేలమందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రతిపాదనలు ఇచ్చింది. అదేవిధంగా విశాఖలో మరో ఎనిమిది క్వాంటమ్ ఏఐ డేటా సెంటర్లు కూడా రానున్నాయి. ఈ ప్రతిపాదనలన్నింటకీ ఎస్‌ఐపీసీ ఆమోదం లభించింది. అలాగే ఈ పెట్టుబడుల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరగనున్న రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోద ముద్ర వేస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ వార్తలనూ చదవండి:
గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య