ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించిన నాగబాబు
ABN , Publish Date - Sep 14 , 2026 | 04:54 AM
పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమి గ్రామంలో ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఆదివారం రాష్ట్ర గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ నాగబాబు సందర్శించారు.
పార్వతీపురం, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమి గ్రామంలో ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఆదివారం రాష్ట్ర గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ నాగబాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఏనుగుల సంరక్షణ కేంద్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి వాటిపై సమీక్షించారు. ఏనుగులు సంచరించే అటవీ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు, తదితర విషయాలను అటవీశాఖాధికారులు ఆయనకు వివరించారు. అనంతరం కుంకీ ఏనుగులకు నాగబాబు స్వయంగా ఆహారాన్ని అందించారు. ఏనుగుల సంరక్షణ ప్రాంతంలో మొక్కలు నాటారు.
ఈ వార్తలనూ చదవండి..
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి
‘డీఎస్సీపై చర్చకు జగన్ సిద్ధమా?’