Share News

వైసీపీకి మద్దతుగా ప్రభుత్వ టీచర్‌ ప్రచారం

ABN , Publish Date - Nov 29 , 2026 | 03:32 AM

విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరాం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మధు నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు!

వైసీపీకి మద్దతుగా ప్రభుత్వ టీచర్‌ ప్రచారం

మెంటాడ, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరాం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మధు నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు! ఈ పంచాయతీలో వైసీపీ మద్దతుగా పోటీ చేస్తున్న అభ్యర్థికి ఈయన బంధువు కావడంతో ఓట్లు అడుగుతున్నట్లు తెలిసింది. దీనిపై స్థానిక టీడీపీ నాయకులు శనివారం జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన.. సదరు ఉపాధ్యాయుడికి దత్తిరాజేరు మండలంలో ఎన్నికల విధులు కేటాయించాలని డిప్యూటీ డీఈవోను ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 03:40 AM