Share News

భోగాపురం ఎయిర్‌పోర్టు పేరుతో నకిలీ ఉద్యోగ ఆఫర్లు

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:37 AM

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం ఎయిర్‌పోర్టు) పేరుతో వస్తున్న నకిలీ ఉద్యోగ ఆఫర్లు, మోసపూరిత సమాచారంపై ఉద్యోగార్థులు అప్రమత్తంగా ఉండాలని...

భోగాపురం ఎయిర్‌పోర్టు పేరుతో నకిలీ ఉద్యోగ ఆఫర్లు

  • ఉద్యోగార్థులను అప్రమత్తం చేసిన జీఎంఆర్‌

శంషాబాద్‌ రూరల్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం ఎయిర్‌పోర్టు) పేరుతో వస్తున్న నకిలీ ఉద్యోగ ఆఫర్లు, మోసపూరిత సమాచారంపై ఉద్యోగార్థులు అప్రమత్తంగా ఉండాలని జీఎంఆర్‌ విశాఖపట్నం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ (జీవీఐఏఎల్‌) హెచ్చరించింది. వైజాగ్‌ విమానాశ్రయాన్ని జీఎంఆర్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ అయిన జీవీఐఏఎల్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. వైజాగ్‌ విమానాశ్రయం, జీవీఐఏఎల్‌ లేదా జీఎంఆర్‌ గ్రూప్‌ పేరుతో కొందరు నకిలీ నియామక ప్రకటనలు, ఆఫర్‌ లెటర్లు పంపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. వీటిని నమ్మి మోసపోవద్దని ఆ సంస్థ సూచించింది. నియామకాలకు సంబంధించి అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగార్థులకు సూచించింది.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 05:37 AM