డీజే శబ్దానికి ఆగిన గుండె!
ABN , Publish Date - Sep 18 , 2026 | 05:37 AM
డీజే పాటల శబ్దానికి ఓ వ్యక్తి గుండె ఆగిపోయింది. మరో యువకుడు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవంలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు ఇలా అర్ధంతరంగా కన్నుమూశారు.
సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో వ్యక్తి మృతి
సోమందేపల్లి, గుత్తి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): డీజే పాటల శబ్దానికి ఓ వ్యక్తి గుండె ఆగిపోయింది. మరో యువకుడు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవంలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు ఇలా అర్ధంతరంగా కన్నుమూశారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో శ్రీకాంత్(35) స్నేహితులతో కలిసి గురువారం వినాయక నిమజ్జనంలో పాల్గొన్నాడు. డీజే పాటలకు నృత్యాలు చేస్తూ ర్యాలీగా వెళుతుండగా శ్రీకాంత్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. పోలీసులు అతడ్ని వెంటనే తమ జీపులో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అక్కడి వైద్యులతో ఏకీభవించని బంధువులు, కుటుంబ సభ్యులు అతడ్ని పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి, శ్రీకాంత్ మృతిచెంది చాలాసేపైందని తెలిపారు. శ్రీకాంత్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
డీజే శబ్దాల కారణంగానే శ్రీకాంత్ మరణించాడని, దీనికి బాధ్యులు ఎవరని బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అనంతపురం జిల్లా గుత్తి స్టేట్ బ్యాంకు కాలనీలో వినాయక మండపం వద్ద బుధవారం రాత్రి మైక్‌లో పాటలకు డ్యాన్స్ చేస్తూ అలసిపోయి అశోక్ కుమార్(28) అనే యువకుడు కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యంకోసం కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు.
ఈ వార్తలనూ చదవండి: