అంటువ్యాధుల నివారణపై దృష్టి పెట్టండి!
ABN , Publish Date - Sep 14 , 2026 | 06:11 AM
వర్షాల నేపథ్యంలో అంటువ్యాధుల వ్యాప్తికి అవకాశం లేకుండా ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసినట్లు మంత్రి సత్యకుమార్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ, స్క్రబ్‌టైపస్, టైఫాయిడ్, నీరు-ఆహారం ద్వారా వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
దోమల నివారణ, తెరల పంపిణీకి ప్రాధాన్యం: మంత్రి సత్యకుమార్
అమరావతి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): వర్షాల నేపథ్యంలో అంటువ్యాధుల వ్యాప్తికి అవకాశం లేకుండా ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసినట్లు మంత్రి సత్యకుమార్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ, స్క్రబ్‌టైపస్, టైఫాయిడ్, నీరు-ఆహారం ద్వారా వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. అంటువ్యాధులు పెరుగుతున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా మలేరియా ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో దోమల మందు పిచికారీ, దోమ తెరలను పంపిణీ చేయాలని ఆదేశించారు. డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాల్లో వెంటనే దోమల నియంత్రణకు చర్యలు చేపట్టడంతో పాటు, వర్షాల కారణంగా నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి దోమల పెరుగుదలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ను సమర్థవంతంగా నిర్వహించాలని మంత్రి సూచించారు.
ఈ వార్తలనూ చదవండి..
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి
‘డీఎస్సీపై చర్చకు జగన్ సిద్ధమా?’