Share News

ప్రతి జిల్లా పరుగులు పెట్టాలి!

ABN , Publish Date - Sep 12 , 2026 | 03:27 AM

ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి విషయంలో జిల్లాలు వెనకబడ్డాయని, పీజీఆర్‌ఎస్‌ దరఖాస్తులను ప్రజల సంతృప్తి మేరకు పరిష్కరించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే, మండల స్థాయిలో అధికారులు నాలుగుసార్లయినా గ్రామాల్లో పర్యటిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.

ప్రతి జిల్లా పరుగులు పెట్టాలి!

  • ప్రజా సమస్యల పరిష్కారంలో 3 శాతమైనా మెరుగుపడాల్సిందే

  • పనిచేయని వారిని బదిలీ చేయండి

  • సామర్థ్యం ఉన్న వారిని ఎంచుకోండి

  • భూములిచ్చిన వారికి ఉద్యోగం ఇవ్వాలి

  • అవసరమైతే నైపుణ్య శిక్షణ ఇవ్వండి

  • జాబ్‌మేళాలపై అవగాహన కల్పించండి

  • ఐటీఐ, పాలిటెక్నిక్‌లను పరిశ్రమలకు అనుసంధానించాలి: సీఎం చంద్రబాబు

  • కలెక్టర్లకు పలు అంశాలపై దిశా నిర్దేశం

  • వచ్చిన రోజే ఫైళ్లు క్లియర్‌ చేయాలి: సీఎం

  • ఫైళ్ల క్లియరెన్స్‌లో అచ్చెన్న ఫస్ట్‌

  • పయ్యావుల, రాంప్రసాద్‌రెడ్డి, ఆనం ఆలస్యం

  • పెన్షన్ల కోసం ఉమ్మడి కుటుంబాల్లో చీలికా?

  • భవిష్యత్‌లో కుటుంబమే యూనిట్‌గా స్కీమ్స్‌

  • పరిశ్రమల గ్రౌండింగ్‌ బాధ్యత కలెక్టర్లదే

  • గ్రామాలకు వెళ్లాలి.. సమస్యలు తీర్చాలి

అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి విషయంలో జిల్లాలు వెనకబడ్డాయని, పీజీఆర్‌ఎస్‌ దరఖాస్తులను ప్రజల సంతృప్తి మేరకు పరిష్కరించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే, మండల స్థాయిలో అధికారులు నాలుగుసార్లయినా గ్రామాల్లో పర్యటిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఇక నుంచి తప్పనిసరిగా గ్రామస్థాయి పర్యటనలు ఉండాలన్నారు. ఆ వివరాలను కూడా ప్రభుత్వానికి తెలియజేయాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లోనూ ఈ ప్రక్రియ జరగాలని సీఎం పేర్కొన్నారు. వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి పీజీఆర్‌ఎస్‌(ప్రజా సమస్యల ఫిర్యా దు వ్యవస్థ) దరఖాస్తుల పరిష్కారంలో 3 శాతమైనా మెరుగుపడాలని, ఏడాదికి 10 శాతం వృద్ధి సాధించాలని చెప్పారు. సమర్థవంతంగా పనిచేయని ఉద్యోగులను పక్కన పెట్టి, ఫలితాలు సాధించే వారికే బాధ్యతలు అప్పగించాలన్నారు. కలెక్టర్ల సదస్సు రెండోరోజు సీఎం ప్రజాఫిర్యాదుల వ్యవస్థపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..


శిక్షణ ఇవ్వండి

పరిశ్రమల కోసం భూములిచ్చిన కుటుంబాలను ఆదుకోవాలి. ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు రావాల్సిందే. దీనికిగాను పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో తెలుసుకుని వాటిపై ప్రజలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. భూములిచ్చినా ఉద్యోగాలు రాలేదన్న అసంతృప్తి ఏ ఒక్కరిలో ఉండకూడదు. నైపుణ్యం పోర్టల్‌ ద్వారా నిర్వహిస్తున్న జాబ్‌మేళాలు, ఇస్తున్న ఉద్యోగాలపై ప్రజలకు కనీస అవగాహన లేదు. దీనిపై విద్యాశాఖ అధికారులు దృష్టిసారించాలి. ఐటీఐలు, పాలిటెక్నిక్‌ కాలేజీలతో పరిశ్రమలను అనుసంధానించి అవసరమైన నైపుణ్యాలు పొందేలా చూడాలి.’

భూసమస్యలన్నీ మార్చి నాటికి పరిష్కారం

వందల ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న భూసమస్యలను మార్చి నాటికి పరిష్కరించాలని సీఎం చంద్రబాబు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు వివిధ జిల్లాల్లో 22ఏ జాబితాలో ఉన్న 232 అంశాలను పరిష్కరించామని రెవెన్యూ అధికారులు చెప్పారు. సుమారు రూ.5,000 కోట్ల విలువైన 31 వేల ఎకరాల భూములకు విముక్తి కల్పించామన్నారు. రైల్వేకోడూరు కండిషనల్‌ పట్టాల సమస్య, అనంతపురంలోని బంజరు భూముల సమస్యలను ఈ నెలలోనే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. రీసర్వే పూర్తయిన భూములకు బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీతో భద్రత కల్పించాలి. నవంబరు 1 నుంచి రియల్‌టైమ్‌లో అనుసంధానించాలి. 45 రోజుల్లో బ్యాక్‌లాగ్‌లో ఉన్న భూ వివరాలు బ్లాక్‌చెయిన్‌లో పెట్టాలి.’’ అని దిశానిర్దేశం చేశారు.

‘‘సమస్యలు లేని సమాజం కోసం మనం కలిసి పనిచేయాలి. జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు వివిధ సేవలపై వ్యక్తమవుతున్న ప్రజాభిప్రాయాన్ని సభల్లోనే చదివి వినిపిస్తున్నాను. ప్రభుత్వ సేవలతో పాటు సంక్షేమ పథకాలపై ప్రజల్లో సానుకూలత వ్యక్తం కావాలి. లోటుపాట్లను సవరించుకోవడం ద్వారా మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది.’’

‘‘అంబాజీపేట భూముల అంశం 120 ఏళ్ల కాలం నాటిది. అలాంటి సమస్యను పరిష్కరించాం. ఇలాంటి అంశాలను ప్రజలకు పూర్తిస్థాయిలో మంత్రులు, ప్రజాప్రతినిధులు వివరించాలి. అప్పుడే మనం ఏం చేస్తున్నామన్నది ప్రజలకు అర్థమవుతుంది.’’

- సీఎం చంద్రబాబు

ఈ వార్తలనూ చదవండి...

స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం:

ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్..

Updated Date - Sep 12 , 2026 | 03:28 AM