వైసీపీ హయాంలో అన్నీ దొంగ సర్వే నెంబర్లే: మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం
ABN , Publish Date - Apr 03 , 2026 | 09:48 PM
ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్రి కిట్టు వ్యవహారశైలిపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అమరావతి, ఏప్రిల్3 : ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్రి కిట్టు వ్యవహారశైలిపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తండ్రీ కొడుకు తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని మంత్రి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, ప్రస్తుత పరిణామాలను ప్రస్తావించారు.
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ..‘కోర్టు ఆదేశాల మేరకే కొబ్బరితోటలో మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాన్ని తొలగించారు. పోలీసుల పట్ల పేర్నినాని, పేర్ని కిట్టు ప్రవర్తించిన తీరును యావత్ ప్రజానీకం చీ కొడుతోంది. మీ హయాంలో దొంగ సర్వే నెంబర్లతో ప్లాట్లు వేశారు. బాధితులు నన్ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. కోనేరు సెంటర్ నుంచి రోడ్డు వెడల్పు పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టావు. బందరు ప్రజలు అమాయకులు కాదు.. నువ్వు చెప్పే మాయమాటలు ఎవ్వరూ వినే పరిస్థితి లేదు. గడిచిన ఐదేళ్లలో ఒక్క జీ+3 ఇళ్ళు అయినా ఇచ్చావా? మేము అధికారంలోకి వచ్చాక 2006 ఇళ్ళు జీ+3 ఇళ్ళు ఇచ్చాం. ఆర్డీవోపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నావ్.. ఇప్పటికైనా మీ భాషా విధానం మార్చుకోవాలి’ అని అన్నారు.
ఇష్టానుసారంగా మాట్లాడటం సరి కాదు: బండి రామకృష్ణ
జనసేన ఇన్ ఛార్జ్ బండి రామకృష్ణ మాట్లాడుతూ.. ‘కూటమిలో సమస్యలు వస్తే.. మేము మేము సర్దు బాటు చేసుకుంటాం. పోలీసులపై ఇష్టానుసారంగా మాట్లాడటం మీకు సరి కాదు. నేను డమ్మీ నా...? మీరు ఎక్కడి నుంచి వచ్చారు. మా ముందు తరాల వారు ఎవ్వరు కూడా మాకు ఏమీ ఆస్తులు ఇవ్వలేదు. మేము కష్టపడి రూపాయి రూపాయి సంపాదించి ఇక్కడ వరకు ఎదిగాం. మీకు కాపులు ఈ రోజు గుర్తు వచ్చారా...? వందకి 90శాతం కాపులు మా నాయకుడు పవన్ కల్యాణ్ వైపే ఉన్నారు’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
భారీ వడగాల్పులు.. విపత్తు నిర్వహణ సంస్థ కీలక సూచనలు
For More AP News And Telugu News