ముగిసిన విధ్వంసం.. మొదలైన పునర్నిర్మాణం: మంత్రి పార్థసారథి
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:58 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్ల కాలం ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. అధికార మదంతో విర్రవీగిన వైసీపీ నేతలు, సామాన్యుల నుంచి ప్రతిపక్ష నేతల వరకు ఎవరినీ వదలకుండా వేధింపులకు గురిచేశారని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.
అమరావతి, ఏప్రిల్ 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్ల కాలం ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. అధికార మదంతో విర్రవీగిన వైసీపీ నేతలు, సామాన్యుల నుంచి ప్రతిపక్ష నేతల వరకు ఎవరినీ వదలకుండా వేధింపులకు గురిచేశారని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. వైసీపీ సాగించిన ఈ 'ఉన్మాద రాజకీయాలు' చివరకు ఉగ్రవాదం కంటే ప్రమాదకరంగా మారాయని పౌర సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. అమరావతిలో జరిగిన ప్రెస్‌మీట్‌లో కార్యక్రమంలో మంత్రి పార్థసారధి గత ప్రభుత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రిపార్థసారథి మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వంలో చట్టాన్ని గౌరవించాల్సిన ప్రజాప్రతినిధులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అరాచకాలు సృష్టించారు. ప్రతిపక్షాలపై భౌతిక దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించడం ద్వారా వారి గొంతు నొక్కారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడంతో రాష్ట్రంలో అశాంతి రాజ్యమేలింది. ప్రజల ఆస్తులను కబ్జా చేయడం, ప్రకృతి వనరులను దోచుకోవడమే పనిగా పెట్టుకున్న వైసీపీ నేతలు, రాష్ట్రాన్ని అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారారు. రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తూ, ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీయించారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెడుతూ పైశాచిక ఆనందం పొందారు. మహిళలపై దాడులు జరుగుతున్నా, ఫిర్యాదులు అందుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. వైసీపీ అరాచకాలను భరించలేక ప్రజలు విసిగిపోయి మార్పు కోరుకున్నారు. కూటమి ప్రభుత్వం, అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి...
జువ్వలదిన్నెపై వైసీపీ నీచ రాజకీయం: మంత్రి అనగాని సత్యప్రసాద్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు స్పీకర్, హోం మంత్రి ఘన నివాళి
Read Latest Telangana News And Telugu News