Share News

దర్జాగా రిగ్గింగ్‌.. ఆపై వీడియో

ABN , Publish Date - Nov 29 , 2026 | 02:58 AM

తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండలం దాచారం సర్పంచ్‌ ఎన్నికల్లో జరిగిన అక్రమాలు ఆలస్యంగా వెలుగు చూశాయి.

దర్జాగా రిగ్గింగ్‌.. ఆపై వీడియో

ఏలూరు జిల్లాలో బరితెగించిన వైసీపీ కార్యకర్తలు

కుక్కునూరు, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండలం దాచారం సర్పంచ్‌ ఎన్నికల్లో జరిగిన అక్రమాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. ఇక్కడ వైసీపీ కార్యకర్తలు యథేచ్ఛగా పోలింగ్‌ బూత్‌లోకి చొరబడ్డారు. రిగ్గింగ్‌కు పాల్పడటమే గాక వీడియోలు కూడా తీసుకున్నారు. స్టాంప్‌ప్యాడ్‌, స్వస్తిక్‌ మార్కులు దగ్గర ఉంచుకుని బ్యాలెట్‌ పేపర్లపై దొంగ ఓట్లు వేశారు. ఒకరు ఓటు వేస్తుంటే మరికొందరు వీడియోలు తీశారు. ఈ పంచాయతీలో వైసీపీ మద్దతుదారు తుట్టి పృథ్వీరాజ్‌ 9 ఓట్లతో టీడీపీ మద్దతు అభ్యర్థి వర్సా వెంకటేశ్‌పై విజయం సాధించారు. రిగ్గింగ్‌కు పాల్పడిన వీడియోలు వైరల్‌ కావడంతో డిప్యూటీ ఎంపీడీవో నరసింహారావుకు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్‌కు, ఐటీడీఏ పీవోకు స్పీడ్‌పోస్టులో ఫిర్యాదు పంపించారు.

ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 03:15 AM