Share News

తూ.గో.జిల్లా రంగంపేట వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి..

ABN , Publish Date - Jun 23 , 2026 | 06:43 AM

తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగంపేట దగ్గర ప్రమాదవశాత్తూ టాటాఏస్ వాహనం బోల్తాపడి ముగ్గురు మృతిచెందగా.. 8మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

తూ.గో.జిల్లా రంగంపేట వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి..
Road Accident in East Godavari

తూర్పుగోదావరి: జిల్లాలో ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగంపేట దగ్గర ప్రమాదవశాత్తూ టాటాఏస్ వాహనం బోల్తాపడి ముగ్గురు మృతిచెందగా.. 8మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు హుటాహుటిన పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనపర్తి ఆస్పత్రికి తరలించారు.


కాగా, మృతులను మసకపల్లి బాబు, మురమర్ల రాజు, కాకడ రాజుగా గుర్తించారు పోలీసులు. ప్రమాదానికి గురైన బాధితులను కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన వారిగా తెలిపారు. అయితే, టాటాఏస్ టైరు పగిలిపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలుస్తోంది. వీరంతా బాపట్ల జిల్లా కొల్లూరుకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి

పవన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో.. పోలీసు విచారణకు దువ్వాడ శ్రీను
సర్‌లో లోపాలు సరిదిద్దండి.. సీఈవోకు టీడీపీ లేఖ

Updated Date - Jun 23 , 2026 | 07:27 AM