పవన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో.. పోలీసు విచారణకు దువ్వాడ శ్రీను
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:42 AM
వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీసుస్టేషన్‌లో సోమవారం విచారణకు హాజరయ్యారు.
స్టేషన్ ముందు మాధురి హంగామా.. కేసు నమోదు?
మెళియాపుట్టి, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీసుస్టేషన్‌లో సోమవారం విచారణకు హాజరయ్యారు. గత ఏడాది ఒక టీవీ చానల్లో ఆయన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై హిరమండలం పోలీసులకు గొట్ట గ్రామానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. 41ఏ నోటీసులు అందుకున్న ఆయన హిరమండలం రానంటూ కొత్తూరు స్టేషన్‌కు ఉదయం 11.30 గంటలకు 50 మంది అనుచరులతో వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో శ్రీను పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో తోపులాట జరిగింది. మరోవైపు.. మధ్యాహ్నం 3.30 గంటలైనా దువ్వాడ శ్రీనును భోజనానికి పంపించలేదంటూ ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి అనుచరులతోవచ్చి స్టేషన్‌ఎదుట హంగామా చేశారు. రాత్రి 8.30 గంటలకు శ్రీనును పోలీసులు పంపించారు. ఈ నెల 27న మరోసారి హాజరు కావాలని చెప్పారు. స్టేషన్ ఎదుట ఆందోళన చేసిన మాధురిపై కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.