మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ అనంతబాబు..
ABN , Publish Date - Aug 11 , 2026 | 08:30 PM
దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 17 నుంచి శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రాజమహేంద్రవరం: దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 17 నుంచి శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. తాను శాసన మండలి సభ్యుడినని, సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉందని పిటిషన్‌లో అనంతబాబు పేర్కొన్నారు.
మండలి సమావేశాల నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అనంతబాబు అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై బుధవారం నాడు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు కౌంటర్ దాఖలు చేయనున్నారు. అనంతరం పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నెల 13న ఆయన బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. వీధి సుబ్రమణ్యం హత్య కేసులో అనంతబాబు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. శాసన మండలి సమావేశాలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ కోరుతూ ఆయన మరోసారి కోర్టును ఆశ్రయించడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
జాతీయ విపత్తు నివారణ నిధిపై పార్లమెంట్ వేదికగా కేంద్రం క్లారిటీ..