పరిశ్రమలకు మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరిక
ABN , Publish Date - May 27 , 2026 | 06:00 PM
గోదావరి నదిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పరిశ్రమలు వ్యర్థాలను గోదావరిలో కలిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాజమండ్రి: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గోదావరి నదిలో కాలుష్యాన్ని నివారించేందుకు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. పరిశ్రమలు ఇక్కడి వనరులను ఉపయోగించుకుని లాభాలు పొందుతున్నాయని, కానీ కాలుష్యంతో ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.
ఏపీ పేపర్ మిల్ యాజమాన్యం తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిందని మంత్రి తెలిపారు. పరిశ్రమ నుంచి విడుదలైన రసాయనాల్లో పీహెచ్ స్థాయి 7 శాతం నమోదైనట్లు చెప్పారు. కలుషిత వ్యర్థాలను గోదావరిలో కలుపుతున్నారని, పరిశ్రమ యాజమాన్యం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పరిశ్రమల నుంచి మురుగునీరు నేరుగా బయటకు వస్తే యజమానులను జైలుకు పంపిస్తామని, గోదావరిలో వ్యర్థాలు కలిపితే ఆ పరిశ్రమలకు తాళాలు వేస్తామని స్పష్టం చేశారు.
గోదావరి పుష్కరాల కోసం రూ.8,500 కోట్ల బడ్జెట్‌తో ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి వెల్లడించారు. యాత్రికుల కోసం టెంట్ సిటీలు, హోం స్టేలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలోనే నంది నాటకోత్సవాలు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏపీ పేపర్ మిల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఆ సంస్థకు రూ.13 కోట్ల పన్ను బకాయిలు ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో భారీగా ఎమ్మార్వోలు బదిలీ
నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. మహానాడులో సీఎం చంద్రబాబు పంచ్ డైలాగ్స్
For More AP News