Share News

రాజమహేంద్రవరానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఎప్పుడంటే..

ABN , Publish Date - May 23 , 2026 | 06:09 PM

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

రాజమహేంద్రవరానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఎప్పుడంటే..
Deputy CM Pawan Kalyan

తూర్పు గోదావరి: రాజమహేంద్రవరంలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరానికి డిప్యూటీ సీఎం పవన్ చేరుకుని ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. సోమవారం ఉదయం పుష్కర్ ఘాట్ నుంచి కోటి లింగాల ఘాట్ వరకు బోటులో ప్రయాణించి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.


ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన ఏర్పాట్లను ఈ రోజు (శనివారం) మంత్రి కందుల దుర్గేశ్, కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు పూర్తి భద్రత కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు చేస్తున్నామన్నారు. మరోవైపు కాలుష్యరహిత పుష్కరాలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు మంత్రి. ఈ ఏర్పాట్లను సోమవారం నాడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలిస్తారని.. అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

చోరీలపై ఉక్కుపాదం: 51 కేసులు ఛేదించి, 60 మంది అరెస్ట్!

కోనసీమ జిల్లా ముమ్మిడివరం వద్ద ఢీకొన్న ఆర్టీసీ బస్సు, కారు..

Updated Date - May 23 , 2026 | 06:22 PM