సీమను వీడని వర్షాభావం!
ABN , Publish Date - Nov 23 , 2026 | 05:11 AM
వరుస తుఫాన్లు వచ్చినా.. రాష్ట్రంలో వానలోటు తీరలేదు!
412 కరువు మండలాల్లో కేంద్ర బృందం పరిశీలన
అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): వరుస తుఫాన్లు వచ్చినా.. రాష్ట్రంలో వానలోటు తీరలేదు! కోస్తాలోని 15 జిల్లాల్లో వర్షపాతం కొంత మెరుగైనా.. సీమ 8 జిల్లాల్లో 30 నుంచి 60శాతం వర్షపాతం లోటు కొనసాగుతోంది. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 83.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 60.2 సెంటీ మీటర్ల వాన పడింది. అయితే వరుస తుఫాన్ల తర్వాత కోస్తాలో వర్షాభావం కొంత భర్తీ అయింది. అయినా రాష్ట్రవ్యాప్తంగా 28ు వర్షపాతం లోటు ఉంది. అర్నబ్, మురసు తుఫాన్లు రాయలసీమపై పెద్దగా ప్రభావం చూపలేదు. జూన్ నుంచి ఇప్పటి వరకు సీమలోని ఏ జిల్లాలోనూ వాన లోటు తగ్గలేదు. ఫలితంగా ప్రభుత్వం 412 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్రబృందం ఇటీవల సీమలో పర్యటించి, కరువును అంచనా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇండియన్ రోడ్ నెట్‌వర్క్ ప్రపంచంలోనే నంబర్‌వన్: నితిన్ గడ్కరీ
బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం