Share News

వైకల్యాన్ని జయించి.. ఎవరెస్ట్‌ బేస్ క్యాంప్‌ను అధిరోహించిన తెలుగు తేజాలు..

ABN , Publish Date - Apr 26 , 2026 | 08:10 PM

చూపు లేకపోయినా, మాట రాకపోయినా, వినికిడి లోపమున్నా.. ఆత్మవిశ్వాసం ఉంటే ఆకాశమే హద్దుగా దూసుకెళ్లొచ్చు అని నిరూపించారు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి.. తెలుగు జాతి గర్వపడేలా సరికొత్త చరిత్రను సృష్టించారు.

 వైకల్యాన్ని జయించి.. ఎవరెస్ట్‌ బేస్ క్యాంప్‌ను అధిరోహించిన తెలుగు తేజాలు..
Mount Everest News

అమరావతి: చూపు లేకపోయినా, మాట రాకపోయినా, వినికిడి లోపమున్నా.. ఆత్మవిశ్వాసం ఉంటే ఆకాశమే హద్దుగా దూసుకెళ్లొచ్చు అని నిరూపించారు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, తెలుగు జాతి గర్వపడేలా సరికొత్త చరిత్రను సృష్టించారు. సాధారణంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకోవడమే సాహసంతో కూడుకున్న పని. అలాంటిది, వివిధ రకాల వైకల్యాలు కలిగిన 21 మంది విద్యార్థులు ఒకే బృందంగా ఏర్పడి ఈ ఘనత సాధించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. అసాధారణ పట్టుదలతో సాగిన వీరి ప్రయాణం నేడు యావత్ దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.


lokesh.jpgమంత్రి నారా లోకేష్ ప్రశంసలు..

రాష్ట్రంలోని దివ్యాంగ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో వీరికి ప్రత్యేక శిక్షణ అందించి, పర్వతారోహణకు అవసరమైన అన్ని వసతులను ప్రభుత్వం కల్పించింది. ఈ అద్భుత విజయంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి, శారీరక పరిమితులను అధిగమించి శిఖరాగ్రాన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన విద్యార్థుల ధైర్యాన్ని ఆయన కొనియాడారు. ఉన్నతాధికారులు ఈ ప్రాజెక్టును విజయవంతంగా పర్యవేక్షించి, విద్యార్థుల రక్షణకు పెద్దపీట వేశారు. తమ పిల్లలు ప్రపంచ శిఖరాన్ని అధిరోహించారని తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందబాష్పాలతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డీ-రెగ్యులేషన్ ఫేజ్-3పై ముందస్తు చర్చలు.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

జగన్‌వి.. శవ రాజకీయాలు.. మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు

వివేకా కేసులో కొత్త మలుపు.. తదుపరి దర్యాప్తు కోరుతూ హైకోర్టులో సునీతారెడ్డి పిటిషన్

Updated Date - Apr 26 , 2026 | 08:38 PM