Share News

మేనకోడలి పెళ్లికి చోటివ్వని జగన్‌కు ఆ అర్హతలేదు: ఉమ

ABN , Publish Date - Oct 22 , 2026 | 05:26 AM

‘తోబుట్టువు షర్మిల తన కూతురు పెళ్లిని బెంగళూరులోని ఇంటిలో చేసుకుంటానంటే కుదరదని వెళ్లగొట్టిన సంకుచిత మనస్తత్వం జగన్‌ది. ఆయనకు రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు’ అని మాజీ మంత్రి దేవినేని ఉమ..

మేనకోడలి పెళ్లికి చోటివ్వని జగన్‌కు ఆ అర్హతలేదు: ఉమ

అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ‘తోబుట్టువు షర్మిల తన కూతురు పెళ్లిని బెంగళూరులోని ఇంటిలో చేసుకుంటానంటే కుదరదని వెళ్లగొట్టిన సంకుచిత మనస్తత్వం జగన్‌ది. ఆయనకు రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు’ అని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ‘తోడబుట్టిన చెల్లికే న్యాయం చేయలేని జగన్‌ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు? గొడ్డలి పార్టీ నేత హింస, విధ్వంసాన్ని నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే గొడ్డలి పార్టీ నేతలు అంతరాష్ట్ర ముఠాలను దించి రాష్ట్రంలో హింసకు పాల్పడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో రప్పా రప్పా భూతాన్ని భూస్థాపితం చేయాలి’ అని ఉమ పిలుపునిచ్చారు.


హింస, ఖూనీ పునాదులపైనే జగన్‌ రాజకీయ ప్రస్థానం: భూమిరెడ్డి

జగన్‌ రాజకీయ ప్రస్థానం హింస, దౌర్జన్యాలు, ఖూనీల పునాదులపైనే మొదలైందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి అన్నారు. ‘ఎన్నికల్లో అడ్డదారులు తొక్కేందుకు చట్టం అంగీకరించకపోవడంతో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ జగన్‌ గగ్గోలు పెడుతున్నారు. ఖూనీ అనే పదానికి పేటెంట్‌ వైఎస్‌ కుటుంబానిదే. హింసతో కట్టిన వైసీపీ సామ్రాజ్యం పేకమేడలా కూలిపోతుంది. కత్తి ఎత్తిన వాడు కత్తికే నాశనమవుతాడు’ అని అన్నారు.

‘‘కూటమి ప్రభుత్వ హయాంలో రౌడీయిజానికి తావులేదు. ఎన్నికల కమిషన్‌ నిబంధన ప్రకారమే అధికారులు వ్యవహరిస్తారు. ‘చెప్పామంటే... చేస్తాం’ అనే నినాదంతో కూటమి ప్రజల్లోకి వెళుతోంది’’ అని టీడీపీ సీనియర్‌ నేత ఎస్‌వీఎస్ఎన్‌ వర్మ అన్నారు. కాగా, ‘స్థానిక ఎన్నికల్లో గొడ్డలి పార్టీ గొడవలు సృష్టించి, దౌర్జన్యాలకు పాల్పడి రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలు చేస్తోంది. వైసీపీ ఎంపీలు వీధి రౌడీల్లా వ్యవహరిస్తూ హింసను ప్రేరేపిస్తున్నారు’ అని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విమర్శించారు.

ఈ వార్తలనూ చదవండి..

కూటమి దూకుడు

పండుగపూట ఘోరం

Updated Date - Oct 22 , 2026 | 05:26 AM