Share News

బీసీ రిజర్వేషన్లపై తీర్పు ఊహించిందే: రామకృష్ణ

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:54 AM

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు ఊహించిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ...

బీసీ రిజర్వేషన్లపై తీర్పు ఊహించిందే: రామకృష్ణ

అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు ఊహించిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసినందున.. ఇకనైనా బీసీల పట్ల కపట ప్రేమ మానుకుని, చిత్తశుద్ధితో వ్యవహరించాలని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీలను మభ్యపెట్టి, వారిని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలాంటి మొక్కుబడి జీవోలివ్వడం దుర్మార్గమని విమర్శించారు.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 05:54 AM